ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌.. సెమీస్‌‌‌‌‌‌‌‌లో సబలెంకా, గాఫ్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌..   సెమీస్‌‌‌‌‌‌‌‌లో సబలెంకా, గాఫ్

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌ ‌‌‌‌‌‌‌:  ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో సీడెడ్ ప్లేయర్లు అరీనా సబలెంకా, కోకో గాఫ్‌‌‌‌‌‌‌‌  సెమీఫైనల్లో పోటీకి రెడీ అయ్యారు.  డిఫెండింగ్ చాంప్‌‌‌‌‌‌‌‌ సబలెంకా అలవోకగా సెమీస్‌‌‌‌‌‌‌‌ చేరగా.. అమెరికా యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ గాఫ్ కష్టంగా క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ను దాటింది. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో  రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ సబలెంకా (బెలారస్)6–-2, 6–-3తో వరుస సెట్లలో తొమ్మిదో సీడ్‌‌‌‌‌‌‌‌ చెక్ రిపబ్లిక్ స్టార్ క్రెజికోవా పై విజయం సాధించింది. 

మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నాలుగో సీడ్ గాఫ్‌‌‌‌‌‌‌‌ 7–-6 (8/6), 6–-7 (3/7), 6–-2తో కోస్త్యుక్‌‌‌‌‌‌‌‌ పై విజయం సాధించింది.  మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో  సెర్బియా లెజెండ్ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ మెల్‌బోర్న్‌లో రికార్డు స్థాయిలో 11వ సారి సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరాడు. క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో టాప్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ 7–-6 (7/3), 4–-6, 6–-2, 6-–3తో 12వ సీడ్‌‌‌‌‌‌‌‌ టేలర్ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)పై గెలిచాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో నొవాక్‌‌‌‌‌‌‌‌ సెమీస్ చేరడం ఇది 48వ సారి కావడం విశేషం.  మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌ సినర్‌‌‌‌‌‌‌‌ (ఇటలీ) 6–-4, 7–-6 (7/5), 6–-3తో ఐదో సీడ్‌‌‌‌‌‌‌‌ ఆండ్రీ రుబ్లెవ్‌‌‌‌‌‌‌‌ (రష్యా)పై గెలిచి సెమీస్‌‌‌‌‌‌‌‌లో నొవాక్‌‌‌‌‌‌‌‌తో ఫైట్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమయ్యాడు.