
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజులుగా విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాకపోవడంతో… సోమవారం(ఫిబ్రవరి-8) నుంచి మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది.అయితే గతేడాది స్టేడియంలోకి 80 వేల మందిని అనుమతించారు. ఈ ఏడాది మాత్రం 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు నిర్వాహకులు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లను రద్దు చేశారు. సోమవారం జరిగే మ్యాచ్‌లకు ప్లేయర్లు మినహా మిగిలినవారందరికి మాస్క్‌లు తప్పని సరి చేశారు.