మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం

మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం

ఏపీలోని సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో ప్రమాదం జరిగింది. చిల్లకొండయ్య పల్లి సమీపంలో ఆటోపై హై టెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. మృతులు గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో వైపు ప్రమాద ఘటనపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషన్ హరి చందన్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకోవాలని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. 

ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అండగానిలుస్తామని  అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు.