ఆటో వాలా కన్నీటి గాథ షూటింగ్​ షురూ

ఆటో వాలా కన్నీటి గాథ షూటింగ్​ షురూ

జన్నారం, వెలుగు: ‘ఆటో వాలా.. కన్నీటి గాథ’ పేరుతో నిర్మిస్తున్న ఓ షార్ట్ ఫిలిం షూటింగ్​ను ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. మండలంలోని చింతగూడకు చెందిన జానపద గాయకుడు, షార్ట్ ఫిలిం డైరెక్టర్ లింగంపెల్లి రాజలింగు దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని, జీవితాన్నే ప్రధానాంశంగా ఈ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే షూటింగ్ ముగించి ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రెసిడెంట్ సిటిమల భరత్ కుమార్, బీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ సులువ జనార్దన్, ఐద్వా జిల్లా ప్రెసిడెంట్ పోతు విజయ, షార్ట్ ఫిలిం నటీ నటులు ఆకుల నరేశ్, కొండుకూరి రాజు, అల్తాటి రాజన్న, సుమలత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.