ఆదిలాబాద్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఆటో.. ప్రయాణికులను రక్షించిన స్థానికులు

ఆదిలాబాద్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన ఆటో.. ప్రయాణికులను రక్షించిన స్థానికులు
  • ఆటో డ్రైవర్ ​అత్యుత్సాహంతో ఘటన

గుడిహత్నూర్,(ఇంద్రవెల్లి) : ఆదిలాబాద్​ జిల్లా వాగులో  ఆటో కొట్టుకుపోయింది. ప్రయాణికులను రక్షించడంతో ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం (సెప్టెంబర్ 03) ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి సట్వాజీగూడకు 8 మంది ప్రయాణికులతో వెళ్తూ ఆటో డ్రైవర్‌‌ వాగు దాటేందుకు ప్రయత్నించాడు. 

వరద తాకిడికి ఆటో బోల్తా పడి వాగులో కొద్ది దూరం కొట్టుకుపోయింది. ప్రయాణికులు ఆర్తనాదాలు చేయగా  స్థానికులు వెళ్లి రక్షించారు. కాగా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి  ఆటోను బయటకు తీయించారు. భారీ వర్షా లు కురుస్తున్నందున ప్రజలు వాగులు, వంక లు దాటే ప్రయత్నం చేయకూడదని పోలీసులు సూచించారు. ఎమర్జెన్సీ అయితే ఫోన్‌‌ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు.