ఆటో సేల్స్ ​అదుర్స్.. మారుతికి భారీ అమ్మకాలు

ఆటో సేల్స్ ​అదుర్స్..  మారుతికి భారీ అమ్మకాలు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ ఇండస్ట్రీ ఆగస్టులో భారీ అమ్మకాలను సాధించింది. బజాజ్​ ఆటో మినహా మిగతా అన్నీ దాదాపు రెండంకెల గ్రోత్​ను చూశాయి. మారుతి సుజుకీ, టయోటాలు ఎన్నడూ లేనన్ని వెహికల్స్​ను అమ్మాయి. బజాజ్​ ఆటో అమ్మకాలు మాత్రం 20 శాతం తగ్గాయి. టాటా మోటార్స్​ అమ్మకాలు కొద్దిగా పడిపోయాయి. టాప్​ కంపెనీల అమ్మకాలు ఇలా ఉన్నాయి. 

మారుతి సుజుకీ

ఈ కంపెనీ ఆగస్టు నెలలో 1,89,082 బండ్లను అమ్మింది. గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయి అమ్మకాలను మారుతి సుజుకీ సాధించలేదు. వీటిలో 1.58 లక్షల యూనిట్లు డొమెస్టిక్​ సేల్స్​ కాగా, 5,790 యూనిట్లను ఒరిజనల్​ ఎక్విప్​ మాన్యుఫాక్చరర్లకు పంపింది. 24,614 యూనిట్లను ఎగుమతి చేసింది. బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్​ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎస్​–క్రాస్​, ఎక్స్​ఎల్​ మోడల్స్​కు డిమాండ్​ ఎక్కువగా ఉంది. ఎస్​యూవీ అమ్మకాలు వార్షికంగా 26,932 యూనిట్ల నుంచి 58,746 యూనిట్లకు పెరిగాయి. కంపెనీ గత ఆగస్టులో 1.65 లక్షల యూనిట్లను అమ్మింది.

టాటా మోటార్స్

టాటా మోటార్స్​ గ్లోబల్ అమ్మకాలు పోయిన నెలలో 78,010 యూనిట్లు కాగా,  ఆగస్టు 2022లో  గ్లోబల్ సేల్స్ 78,843 యూనిట్లు. మొత్తం దేశీయ విక్రయాలు కూడా 76,479 యూనిట్ల నుంచి 76,261 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. దేశీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వెహికల్స్​తో సహా ప్యాసింజర్ వెహికల్స్​ విక్రయాలు 3.5 శాతం తగ్గి 45,513 యూనిట్లకు చేరాయి. ఆగస్టు 2022లో 47,166 యూనిట్లు అమ్ముడయ్యాయి.  ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్స్​ విక్రయాలు 54.9 శాతం పెరిగి 6,236 యూనిట్లకు చేరాయి. గత ఏడాది నెలలో 4,026 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది. మొత్తం కమర్షియల్​ వెహికల్స్​ విక్రయాలు 31,492 యూనిట్ల నుంచి 1.9 శాతం వృద్ధితో 32,077 యూనిట్లుగా నమోదయ్యాయి.

టయోటా కిర్లోస్కర్ మోటార్స్

ఇది కిందటి  నెల 22,910 యూనిట్లను విక్రయించింది. ఆగస్టు 2022తో పోల్చితే కంపెనీ సంవత్సరానికి 53 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆగస్టులో కంపెనీ 14,959 యూనిట్లను అమ్మింది. దేశీయ విక్రయాలు 20,970 యూనిట్లుగా ఉన్నాయి.  టయోటా ఈసారి ఆగస్టులో 1,940 యూనిట్లను ఎగుమతులు చేసింది.

మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం&ఎం) గత నెలలో 70,350 వెహికల్స్​ను అమ్మింది. ఎగుమతులతో సహా సంవత్సరానికి  19 శాతం వృద్ధిని నమోదు చేసింది. యుటిలిటీ వెహికల్స్ విభాగంలో దేశీయ  విపణిలో 37,270 యూనిట్ల ఎస్​యూవీలతో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది.  ఎగుమతులతో సహా మొత్తం 38,164 యూనిట్లను సేల్ ​చేసింది. మహీంద్రా కమర్షియల్​ వెహికల్స్​ దేశీయ విక్రయాలు 23,613 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత ఆగస్టులో 59 వేల యూనిట్లను అమ్మింది. 

బజాజ్ ఆటో

బజాజ్​ టూవీలర్స్​ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 20 శాతం తగ్గి 2.85 లక్షల యూనిట్లకు పడిపోయాయి.  దేశీయ అమ్మకాలూ భారీగా తగ్గాయి. అయితే ఆగస్టులో కంపెనీ ఎగుమతులు 2 శాతం పెరిగాయి. దీని మొత్తం దేశీయ విక్రయాలు 20 శాతం క్షీణించి 2,56,755 యూనిట్ల నుంచి 2,05,100 యూనిట్లకు పడిపోయాయి. ఎగుమతులు 6 శాతం తగ్గి 1,44,840 యూనిట్ల నుంచి 1,36,548 యూనిట్లకు పడిపోయాయి. 

హ్యుందాయ్ 

హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్​ఎంఐఎల్) ఆగస్టులో 71,435 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ నెల మొత్తం అమ్మకాలు దేశీయ మార్కెట్‌‌‌‌లో 53,830 యూనిట్లు కాగా, 17,605 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.  ఎస్​యూవీలకు బలమైన డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాలలో 60 శాతానికి పైగా ఇవే ఉన్నాయి. ఎక్స్​టర్​కు చాలా డిమాండ్​ ఉందని కంపెనీ సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఒకరు చెప్పారు. ఇప్పటి వరకు 65,000 కంటే ఎక్కువ బుకింగ్‌‌‌‌లు వచ్చాయని చెప్పారు. 

అశోక్ లేలాండ్

కమర్షియల్ ​వెహికల్స్​ తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఆగస్టు 2023లో మొత్తం అమ్మకాలు 10 శాతం పెరిగి 15,576 యూనిట్లకు చేరుకున్నాయి.   గతేడాది ఇదే నెలలో 14,121 యూనిట్లను అమ్మింది.  గత నెలలో మొత్తం దేశీయ విక్రయాలు 13,301 యూనిట్ల నుంచి 14,545 యూనిట్లకు పెరిగాయి. దేశీయ మార్కెట్లో మీడియం,  భారీ కమర్షియల్​ వెహికల్స్​ విక్రయాలు ఆగస్టు 2022లో 7,671 యూనిట్లతో పోలిస్తే 17 శాతం పెరిగి 9,013 యూనిట్లుగా నమోదయ్యాయి.  దేశీయ మార్కెట్‌‌‌‌లో తేలికపాటి కమర్షియల్​ వెహికల్స్​ విక్రయాలు 5,630 యూనిట్ల నుంచి 2 శాతం తగ్గి 5,532 యూనిట్లకు చేరుకున్నాయి.

టీవీఎస్​ మోటార్

టీవీఎస్​ మోటార్ కంపెనీ 2023 ఆగస్టులో 3,45,848 యూనిట్లు అమ్మింది.  గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 3,33,787 యూనిట్లు. అమ్మకాలు వార్షికంగా నాలుగు శాతం పెరిగాయి. టూవీలర్స్​ విక్రయాలు గత నెలలో 3,15,539 యూనిట్ల నుంచి 5 శాతం పెరిగి 3,32,110 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ టూవీలర్స్​ అమ్మకాలు 2,39,325 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధితో 2,56,619 యూనిట్లకు పెరిగాయి. 2023 ఆగస్టులో మోటార్‌‌‌‌సైకిల్ విక్రయాలు 1,57,118 యూనిట్ల నుంచి 1,53,047 యూనిట్లకు తగ్గాయి. స్కూటర్ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 1,21,866 యూనిట్ల నుంచి 1,42,502 యూనిట్లకు పెరిగాయి.