స్పైడర్ మ్యాన్‌ని బీట్ చేసిన అవతార్

స్పైడర్ మ్యాన్‌ని బీట్ చేసిన అవతార్

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినిమా అవతార్: ది వే ఆఫ్ వాటర్. గత ఏడాది డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ల వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. దీంతో స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్ సినిమా రికార్డును బద్దలు కొట్టి.. ఆల్‌ టైం అత్యధిక వసూళ్లు చేసిన 6వ సినిమాగా రికార్డుకెక్కింది. కోవిడ్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా అవతార్ : ది వే ఆఫ్ వాటర్ నిలిచింది.

ఇప్పటివరకు అవతార్ : ది వే ఆఫ్ వాటర్ 1.928 బిలియన్ డాలర్లు సంపాదించి 6వ ప్లేస్ లో ఉండగా, స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్ 1.921 బిలియన్ డాలర్లు రాబట్టి ఏడవ స్థానంలో నిలిచింది. మొదటి ప్లేస్‌లో అవతార్ ఉంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 2.922 బిలియన్ డాలర్లు వచ్చాయి. తర్వాతి స్థానాల్లో అవేంజర్స్ : ఎండ్ గేమ్ 2.799 బిలియన్ డాలర్లు, టైటానిక్ 2.194 బిలియన్ డాలర్లు ఉన్నాయి.