జీవితంపై విరక్తి..ఆత్మహత్యకు యత్నం

జీవితంపై విరక్తి..ఆత్మహత్యకు యత్నం

కోహెడ, వెలుగు: జీవితంపై విరక్తి చెంది వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన ఇప్ప హన్మయ్య(71), ఇప్ప వెంకటమ్మ(70) భార్యాభర్తలు. కొద్దిరోజులుగా వారికి ఆరోగ్యం సహకరించడం లేదు. హైదరాబాద్​లో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లగా హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ చేయించాడు. కొన్ని రోజులు కొడుకు వద్దనే ఉండి తిరిగి ఇటీవల సొంత గ్రామానికి వచ్చారు. మందులు వేసుకున్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం పురుగుల మందు తాగారు. గమనించిన చుట్టుపక్కలవారు సిద్దిపేట గవర్నమెంట్​హాస్పిటల్​కి తరలించారు. గురువారం హన్మయ్య మృతిచెందాడు. వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉంది.