బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి : ఏవీఎన్ రెడ్డి

బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీలకు బుద్ధి చెప్పాలి : ఏవీఎన్  రెడ్డి

అయిజ, వెలుగు: రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని టీచర్స్  ఎమ్మెల్సీ ఏవీఎన్  రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్  హాల్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ హయాంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్  అప్పుల్లో ముంచాడని విమర్శించారు. దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను అనుచరులకు ఇస్తూ మోసం చేస్తున్నాడన్నారు. రాంచంద్రారెడ్డి, సందీప్ పాటిల్, తిరుమలరెడ్డి, జలగరి అశోక్, మాదన్న, శేఖర్, బంగి లక్ష్మన్న, స్వప్న, భీంసేన్ రావు, నరసింహయ్యశెట్టి, భగత్ రెడ్డి పాల్గొన్నారు.