విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలె: డీకే అరుణ

విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలె: డీకే అరుణ

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులకు సరైన సపోర్టు అందడం లేదని బీజేపీ నేత డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పాఠశాలల పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఏవిఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు డీకే అరుణ, రామ్ చంద్రరావు, వివేక్ వెంకటస్వామి, మర్రశశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఏవిఎన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులందరిని కోరుతున్నానని డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‭కు బీజేపీ పార్టీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. 

విద్య పైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని డీకే అరుణ విమర్శించారు. గురుకుల పాఠశాలలో పిల్లలకు పురుగుల అన్నం పెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు సరైన వసతులు లేవని.. కిరాయి భవనాల్లో స్కూళ్లను నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఏవిఎన్ రెడ్డిని గెలిపించి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీకే అరుణ పిలుపునిచ్చారు.