కాఫీ, టీ, మందు మానేయండి : ఆరోగ్య శాఖ అలర్ట్

కాఫీ, టీ, మందు మానేయండి : ఆరోగ్య శాఖ అలర్ట్

ఈ వేసవిలో ఇంట్లో ఉన్నంత సేపు బాగానే అనిపించినా.. బయటకు అడుగుపెట్టడం మాత్రం సవాలుగా మారుతోంది. దాని వల్ల అలసట, హీటో స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే శరీరాన్ని నిత్యం హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎయిర్ కండిషన్డ్ పరిసరాలలో ఉండటం చాలా అవసరం. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య వేడి-సంబంధిత అనారోగ్యాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు మద్యం, టీ, కాఫీ,  కార్బోనేటేడ్ శీతల పానీయాలు ఎక్కువ తీసుకోకూడదని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అధిక ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని, పాడైపోయిన ఆహారం తీసుకోవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది.

హైడ్రేటెడ్ గా ఉండటం, క్రమం తప్పకుండా నీరు త్రాగడం ద్వారా శరీరం నిర్జలీకరణకు గురి కాదు. ఈ సమస్య తీవ్రమైతే విపరీతమైన బలహీనత, అలసట, ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన జాగ్రత్తలు..

  •     వేసవి ఎక్కువగా ఉండే సమయంలో వంట చేయడం మానుకోండి.
  •     వంట చేసే ప్రదేశాన్ని వెంటిలేట్ చేయడానికి తలుపులు, కిటికీలను తెరవండి.
  •     ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలను నివారించండి. ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోయే అవకాశం ఉంది.
  •     అధిక మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని మానుకోండి.

వీటికి బదులు కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి చల్లని పానీయాలు తీసుకోండి. మితిమీరిన భోజనం తినడం కూడా శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల మీకు అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. అతిగా భోజనం చేస్తే  జీర్ణం కావడానికి చాలా కష్టమవుతుంది. దీని వల్ల మీకు మరింత చెమట, నీరసంగా అనిపిస్తుంది. అందువల్ల, వేసవిలో తేలికైన, తాజాగా వండిన భోజనాన్ని తినాలని సూచించింది.

https://twitter.com/MoHFW_INDIA/status/1667407111519895552