మాస్క్​ కంటే రెస్పిరేటర్లు వాడడం సేఫ్​

మాస్క్​ కంటే రెస్పిరేటర్లు వాడడం సేఫ్​

కరోనా మొదలైన్పటి నుంచి అందరిలో ‘ఏ మాస్క్​ పెట్టుకుంటే సేఫ్​?’ అనే అలోచనే. కొత్త వేరియెంట్​ ఒమిక్రాన్​ రావడంతో ఆ ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి. ఈ టైమ్​లో ప్రొటెక్షన్​ కోసం అప్​గ్రేడ్​ అవ్వాలని,  మాస్క్​ కంటే రెస్పిరేటర్లు వాడడం సేఫ్​ అంటున్నారు రీసెర్చర్లు.  దాదాపు ముఖం మొత్తం కప్పి ఉంచే  ఇవి గాల్లోని వైరస్, బ్యాక్టీరియాల్ని ఎఫెక్టివ్​గా అడ్డుకుంటాయట. కరోనా ఇన్ఫెక్షన్​ రిస్క్​ ఉన్న డాక్టర్లు, సర్జన్లు కొందరు ఇప్పటికే వీటిని వాడుతున్నారు కూడా. 
కరోనా ఫస్ట్​వేవ్​ నుంచి బయటికి వెళ్లేవాళ్లకు రెస్పిరేటర్ తప్పనిసరి చేసింది ఆస్ట్రియా. అమెరికాలోని ‘సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్ ప్రివెన్షన్​’ కూడా మాస్క్​ల కంటే రెస్పిరేటర్లు చాలా సేఫ్​ అని చెప్పింది.హెల్త్ వర్కర్లు, ల్యాబొరేటరీ వాళ్ల మీద చేసిన స్టడీల్లో కూడా  కరోనా ఇన్ఫెక్షన్​ని అడ్డుకోవడంలో రెస్పిరేటర్లు బాగా పనిచేశాయని తెలిసింది కూడా.  
రెస్పిరేటర్లు ఎంత సేఫ్​ అంటే.. 
కరోనా సోకినవాళ్లు రెస్పిరేటర్స్​ పెట్టుకున్నవాళ్లని ముట్టుకున్నా కూడా 25 గంటల పాటు ప్రొటెక్షన్ ఉంటుంది. క్లాత్​ మాస్క్​ పెట్టుకున్నవాళ్లు అయితే 26 నిమిషాల్లోనే కరోనా బారిన పడే ఛాన్స్ ఉంది. అందుకనే వ్యాక్సిన్ల లెక్కనే రెస్పిరేటర్లు కూడా ఫ్రీగా ఇవ్వాలని, లేదంటే తక్కువ ధరకే దొరికేలా చూడాలని అంటున్నారు కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ సైంటిస్ట్​ లెయ్​లా అస్​డిక్​, ఆస్ట్రేలియాలోని కిర్బీ ఇనిస్టిట్యూట్​ ప్రొఫెసర్​ రైనా మెక్​ఇన్​టైర్. దాంతో కరోనా లాంటి ఇన్ఫెక్షన్లని తొందరగా కంట్రోల్​ చేయొచ్చని చెప్తున్నారు వీళ్లు.
లాభాలివి
రెస్పిరేటర్లని చాలా మంది కొత్తరకం మాస్క్​లు అనుకుంటారు. కానీ, ఇవి ‘పర్సనల్​ ప్రొటెక్షన్​ ఎక్విప్​మెంట్స్​’. గాల్లో ఉండే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, ఇతర పొల్యూటెంట్స్​ని పట్టి ఉంచేలా  వీటిని డిజైన్ చేశారు. ప్రాణాంతకమైన వైరస్​ పార్టికల్స్​ని 95శాతం అడ్డుకుంటాయి. రెస్పిరేటర్లు పెట్టుకుంటే ఎవరైనా తుమ్మినా, దగ్గినా కరోనా సోకుతుందేమోననే భయం ఉండదు.  రెండు హెడ్ స్ట్రాప్స్, ముక్కు దగ్గర అడ్జస్టబుల్​ క్లిప్​ ఉంటుంది. అంతేకాదు వీటికి ఐఎస్​ఐ అప్రూవల్​ కూడా ఉంది.  వీటి ధర రూ.4 వేల నుంచి 5 వేలు.