నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆర్మూర్, వెలుగు: టెన్త్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక మార్కులు సాధించిన 32 మంది స్టూడెంట్లను విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం (వేవా) ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్టూడెంట్లకు నగదు, ప్రతిభా పురస్కారాలతో అందజేశారు. కార్యక్రమంలో ఏపీపీ ముప్పెడ రజనీ కీర్తిసాగర్, వేవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుకాల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.రాజారాం, ఆర్మూర్​ డివిజన్ ప్రెసిడెంట్ బి.శంకర్, ప్రధాన కార్యదర్శి వి.లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజేశ్వర్, విశ్వ 
బ్రాహ్మణ సంఘం సభ్యులు ఖత్రాజీ రాజేశ్వర్, కోటగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో..

నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రతిభ చాటిన టెన్త్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లను సన్మానించారు. మాణిక్‌‌‌‌‌‌‌‌ భవన్ పాఠశాలలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌కు నగర మేయర్ నీతూ కిరణ్ హాజరై మాట్లాడారు. మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా  అధ్యక్షుడు గోపాల కృష్ణాచార్య, డివిజన్ అధ్యక్షుడు గణేశ్‌‌‌‌‌‌‌‌ ఆచార్య , గౌరవాధ్యక్షులు రాంచందర్, కోశాధికారి శ్రీధర్ ఆచారి పాల్గొన్నారు.

రెండు రోజులుగా ఒకటే వాన

ఉమ్మడి జిల్లాలో స్తంభించిన జనజీవనం                      
వాగులు, చెరువుల్లో భారీ వరద

నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో రెండు రోజులు కురిసిన వానలతో జన జీవనం స్తంభించింది. జిల్లాలోని చందూర్ మండలంలో అత్యధికంగా 19 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 29 మండలాల్లో 325.5  మిల్లిమీటర్ల వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. 1,045  చెరువులు నిండిపోయి జలకళను సంతరించుకున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ పేర్కొనడంతో ఆఫీసర్లు అలెర్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.   

ప్రాజెక్టులకు ఇన్​ఫ్లో..

శ్రీరాంసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం1,088.6 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ 90.325 టీఎంసీల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం 78.3 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి వరద కొనసాగుతుండడంతో 4  గేట్లను ఎత్తి 16,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పోచారం, రామడుగు, కళ్యాణి, కౌలాస్​ నాలా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లోకి వరద నీరు చేరుతోంది.  

కామారెడ్డిలో పొద్దంతా ముసురు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో మంగళవారం పొద్దంతా  ముసురు పెట్టింది. పొద్దటి నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంతో పాటు  పలు ఏరియాల్లో మురుసు వాన కురిసింది. జిల్లా వ్యాప్తంగా 13 మి.మీ వరకు వర్షపాతం నమోదైనట్లు ఆఫీసర్లు తెలిపారు.

హాస్టళ్ల సమస్యలు పరిష్కరించండి

నిజామాబాద్, వెలుగు: హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం అందించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌ సూర్య నారాయణ డిమాండ్​ చేశారు. ఇందూరులోని 36వ డివిజన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఎస్టీ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం ఆయన సందర్శించారు.  హాస్టల్‌‌‌‌‌‌‌‌ రూమ్స్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వార్డెన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సరుకులకు సంబంధించి రిజిస్టర్ మెయింటెన్ ‌‌‌‌‌‌‌‌చేయడంలేదన్నారు. పోటీ ‌‌‌‌‌‌‌‌పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలకు సరైన భోజన వసతి కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్లు, స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌‌‌‌‌‌‌‌కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ల మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, లీడర్లు బూర్గుల వినోద్, పంచ  రెడ్డి శ్రీధర్ ఉన్నారు.

ప్రతిభ చాటిన స్టూడెంట్లకు సన్మానం

ఆర్మూర్, వెలుగు: టెన్త్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక మార్కులు సాధించిన 32 మంది స్టూడెంట్లను విశ్వకర్మ ఉద్యోగుల సంక్షేమ సంఘం (వేవా) ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్టూడెంట్లకు నగదు, ప్రతిభా పురస్కారాలతో అందజేశారు. కార్యక్రమంలో ఏపీపీ ముప్పెడ రజనీ కీర్తిసాగర్, వేవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుకాల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు గోపాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.రాజారాం, ఆర్మూర్​ డివిజన్ ప్రెసిడెంట్ బి.శంకర్, ప్రధాన కార్యదర్శి వి.లక్ష్మీనారాయణ, కోశాధికారి రాజేశ్వర్, విశ్వ 
బ్రాహ్మణ సంఘం సభ్యులు ఖత్రాజీ రాజేశ్వర్, కోటగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో..

నిజామాబాద్ టౌన్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌ విశ్వకర్మ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రతిభ చాటిన టెన్త్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లను సన్మానించారు. మాణిక్‌‌‌‌‌‌‌‌ భవన్ పాఠశాలలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌కు నగర మేయర్ నీతూ కిరణ్ హాజరై మాట్లాడారు. మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా  అధ్యక్షుడు గోపాల కృష్ణాచార్య, డివిజన్ అధ్యక్షుడు గణేశ్‌‌‌‌‌‌‌‌ ఆచార్య , గౌరవాధ్యక్షులు రాంచందర్, కోశాధికారి శ్రీధర్ ఆచారి పాల్గొన్నారు.

స్టూడెంట్ల కోసం గాంధీ సినిమా

పిట్లం, వెలుగు: 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా స్టూడెంట్లకు మంగళవారం గాంధీ సినిమాను చూపించారు. పిట్లం వెంకటేశ్వర సినిమా హాల్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్సై రంజిత్​మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కస్తూర్భా స్కూళ్లలో చదువుతున్న  319 మంది స్టూడెంట్లతో పాటు పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు సినిమాను చూపించామని చెప్పారు. 

భూ సమస్యలను పరిష్కరించాలి

కమ్మర్పల్లి, వెలుగు:  ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో అటవీ, రెవెన్యూ భూముల వివాదాలను పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ సబ్ డివిజన్ ప్రెసిడెంట్ సారా సురేశ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ హక్కులను పరిరక్షించుకోవడం కోసం ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలు ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ కమ్మర్పల్లి సబ్ డివిజన్ సెక్రటరీ సురేశ్‌‌‌‌‌‌‌‌, మండల ప్రెసిడెంట్ బాలయ్య పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కామారెడ్డి, వెలుగు: వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్​రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమిరెడ్డి అంజయ్య కోరారు. మంగళవారం  కామారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రస్తుతం కరెంట్‌‌‌‌‌‌‌‌ 8 గంటల కరెంట్‌‌ మాత్రమే ఇస్తున్నారని, 24 గంటల పాటు సప్లయ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అంబీర్ ఆనంద్‌‌‌‌‌‌‌‌రావు, జిల్లా ప్రెసిడెంట్ శ్రీలంక వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పైడి విఠల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీలు సాయిలు, సాయిరెడ్డి పాల్గొన్నారు. 

పశువుల కాపరిపై ఎలుగుబంటి  దాడి

లింగంపేట, వెలుగు: మండలంలోని పోల్కంపేట గ్రామానికి చెందిన తలారి రాములు (42) అనే పశువుల కాపరిపై మంగళవారం సాయంత్రం ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు గ్రామస్తులు తెలిపారు. రాములు రోజు మాదిరిగా పశువులను మేత కోసం అడవికి తీసుకెళ్లి గ్రామానికి  తిరిగి వస్తుండగా పోల్కంపేట తండా రోడ్డు సమీపంలో ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలిపారు. దాడిలో రాములు తల, తొడ భాగాలు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

లైన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యంతో యువకుడి మృతి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో లైన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ నిర్లక్ష్యంతో రంగోని వినయ్ గౌడ్​(20) మృతి చెందాడని కుటుంబీకుల ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. గ్రామంలోని పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో కరెంట్‌‌‌‌‌‌‌‌ పోవడంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రి సిబ్బంది లైన్ మెన్ వినోద్‌‌‌‌‌‌‌‌కు ఫోన్​చేశారు. రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆయన వెళ్లకుండా గ్రామానికి చెందిన వినయ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ను పంపాడు. వినోద్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కి రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘనంగా ఆదివాసీ దినోత్సవం

నందిపేట/ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నందిపేట మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకపోడ్, సీపీఐ (ఎంఎల్), ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కొమురం భీం ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అనంతరం ఏఐకేఎంఎస్​ జిల్లా అధ్యక్షుడు గంగాధర్​ మాట్లాడుతూ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడ్ కుల సభ్యులు మన్నె సాగర్, గంగాధర్, రమేశ్‌‌‌‌‌‌‌‌, సాయరెడ్డి, దేవన్న పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం చేపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఆదివాసుల జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సర్పంచ్ ఇందూరు సాయన్న, ఎంపీటీసీ బాలనర్సయ్య నల్లం బావి వద్ద కొమురం భీం విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నడ్కుడ చిన్న శ్రీనివాస్, మాజీ ప్రజాప్రతినిధులు సాందన్న , గంగారెడ్డి, గంగాధర్, శ్రీనివాస్, రిక్కల రాజు, వేల్పుల సతీశ్‌‌‌‌‌‌‌‌, నాయకపోడ్ సంఘ అధ్యక్షుడు రాజేశ్వర్, పొద్దుటూరి రాజేందర్ పాల్గొన్నారు .

బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరి మృతి

మెండోరా, వెలుగు: మండలంలోని బుస్సాపూర్ గ్రామ శివారులో  44వ నేషనల్ హైవేపై ఆగి ఉన్న బైక్‌‌‌‌‌‌‌‌ను నిర్మల్ వైపు నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు  ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సెల్ ఫోన్ ఆధారంగా మృతులు పెర్కిట్ గ్రామానికి చెందిన గౌతం(19), బబ్బు (17) గా గుర్తించినట్లు తెలిపారు. వీరు ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ చదువు తున్నట్లు తెలిపారు. డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను పోస్టుమార్టం కోసం బాల్కొండ పీహెచ్‌‌‌‌‌‌‌‌సీకి తరలించినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

భిక్కనూరు, వెలుగు: మండలంలోని జంగంపల్లి సమీపంలోని పెద్ద చెరువులో యువతి ఆత్మహత్య చేసుకుందని ఎస్సై ఆనంద్​గౌడ్ తెలిపారు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలు ఆయన కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కారేగామ్‌‌‌‌‌‌‌‌కు చెందిన పూలే పంచశీల (20)నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో డీగ్రి పూర్తి చేసింది. ఇటీవల జరిగిన ఎస్సై ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాసి హైదరాబాద్​ నుంచి తిరిగి తన స్వగ్రామానికి వస్తూ ఇంటికి ఫోన్​చేసి తాను ఎగ్జామ్​లో పాస్‌‌‌‌‌‌‌‌ అవుతానో లేదో అని వాపోయింది. ఈ క్రమంలోనే చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

డ్యూటీ టైంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్లు

డిచ్ పల్లి ఎంపీవో సస్పెన్షన్

డిచ్ పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల ఎంపీవో రూటే వేరు. డ్యూటీ టైంలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్లలో బిజీగా ఉండడం. చాన్స్ దొరికినప్పుడల్లా సర్పంచులు, ఉప సర్పంచుల మధ్య గొడవలు సృష్టించడం.. వివిధ పనులపై వచ్చిన పంచాయతీ సెక్రటరీలను నానా బూతులు తిట్టడం.. అక్రమ వసూళ్లతో పాటు ప్రజావాణి ఫిర్యాదులను పక్కన పెట్టేయడం.. చెక్కులపై సంతకాలు పెట్టకుండా వేధించడం.. ఇదీ ఆయన పనితీరు. ఎంపీవో నాగేంద్రప్ప ప్రవర్తనతో విసిగిపోయిన డిచ్ పల్లి మండలం ధర్మారం(బి) పంచాయతీ పాలకవర్గం, కలెక్టర్​కు ఫిర్యాదు చేసింది. చెక్కులపై ఎందుకు సంతకం చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించగా.. తనకు బీపీ, షుగర్ ఉందంటూ బుకాయించాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ఎంపీవోను సస్పెండ్ చేయడమే కాక పూర్తి విచారణకు ఆదేశించారు. తన అనుమతి లేకుండా మండలాన్ని వదిలి వెళ్లకూడదని కూడా కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

కామారెడ్డి, వెలుగు: ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పోలీసు ఆఫీసర్లు కృషి చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసును ఆయన విజిట్ చేశారు. ఆఫీసు ఆవరణలో మొక్క నాటారు. అనంతరం భారత వజ్రోత్సవాల సందర్భంగా  సీఎస్​ సోమేశ్‌‌‌‌‌‌‌‌కుమార్ నిర్వహించిన వీసీలో  డీజీపీ ఇక్కడి నుంచి పాల్గొని ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌పై ఆయా జిల్లాల ఆఫీసర్లకు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ పని తీరు బాగుందని కితాబిచ్చారు.  ఎస్పీ బి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య పాల్గొన్నారు. 

సర్పంచ్ భర్త అరెస్టుపై నిరసన

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అవాస్తవమని, కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్‌‌గౌడ్‌‌ కక్ష గట్టి కేసులో ఇరికించారని గౌడ సంఘం లీడర్లు ఆరోపించారు. ప్రసాద్ అరెస్టును నిరసిస్తూ మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అమరవేని నర్సాగౌడ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కలెక్టర్, డీపీవోను కలిసిన తర్వాత వారి సూచనతోనే ప్రసాద్ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లాడని చెప్పారు. దీంతో కావాలనే హత్యాయత్నం కేసులో ఇరికించారని ఆరోపించారు. మహిళ అని చూడకుండా కల్లెడ సర్పంచ్ లావణ్యను ఏ2 గా చేర్చడం అమానుషమన్నారు. కార్యక్రమంలో డివిజన్ గౌడ సంఘం ప్రెసిడెంట్‌‌ రామాగౌడ్, లింగాగౌడ్, నవీన్, శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.