V6 News

భవనాల నిర్వహణపై అవగాహన

భవనాల నిర్వహణపై అవగాహన

హైదరాబాద్​, వెలుగు: హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్​డబ్ల్యూఏ) బాధ్యతలు, భద్రతా ప్రమాణాలు,  రెన్యూవల్స్​పై అవగాహనకు నారెడ్కో తెలంగాణ, ఎఫ్ టీసీసీఐ, యూ ఫెర్వాస్ హైదరాబాద్​లో సదస్సు నిర్వహించాయి.  భవనాల నిర్వహణలో ఎదురయ్యే చట్టపరమైన ఇబ్బందులు తప్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు.   

పెరుగుతున్న ఎత్తైన భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల భద్రతకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తెలిపారు. లిఫ్ట్ మెయింటెనెన్స్, స్ట్రక్చరల్ ఆడిట్ వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.