జై శ్రీరాం : అయోధ్యలోని ఇళ్లే.. హోటల్స్

జై శ్రీరాం : అయోధ్యలోని ఇళ్లే.. హోటల్స్

అయోధ్యలో ఇళ్లను హోటళ్లుగా  తీర్చిదిద్దుతున్నారు.  వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.  దీంతో అయోధ్యకు భారీగా భక్తులు రానున్నారు.  సందర్శకుల రద్దీకి అయోధ్యలోని ఇళ్లు హోమ్​ స్టేలుగా మారుతున్నాయి. 

రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య నివాసితులు ఇళ్లను హోమ్‌స్టేలుగా నమోదు చేసుకున్నారు.   జనవరిలో అయోధ్యలో  సందర్శకుల రద్దీఎక్కువుగా ఉంటుంది. ఇప్పటికే హోమ్​ స్టేలుగా మారిన అయోధ్యలోని ఇళ్లను బుక్​ చేసుకున్నారు.  

అయోధ్యలో 2024, జనవరి 22న జరిగే మహత్తరమైన వేడుక రామజన్మభూమిలో రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠ కార్యక్రమానికి 6 వేల మంది ఆహ్వానాలు పంపారు. ఇప్పటి వరకు అయోధ్యలో 1800 గదులతో 500 హోమ్​ స్టేలను బుక్​ చేసుకున్నారు. శ్రీరామ జన్మభూమి ప్రాణ్ ప్రతిష్ట వేడుకకు  3వేల మంది VVIPలు  4 వేల  మంది సీర్లు ఉన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్   ఈ కార్యక్రమానికి హాజరయ్యే  ప్రముఖులలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో పాటు ఇతరులకు కూడా ఆహ్వానాలు పంపామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఇంకా 50 దేశాల ప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపుతామని ఆయ తెలిపారు.రామ మందిర ఉద్యమంలో అమరులైన  కరసేవకుల కుటుంబాలను కూడా ట్రస్ట్​ ఆహ్వానిస్తుంది.  ఇంకా శాస్త్రవేత్తలకు, న్యాయమూర్తులకు, రచయితలకు, కవులకు ఆహ్వానాలు పంపుతామని చంపత్ రాయ్ తెలిపారు.