వర్షాకాలంలో ఈ కూరగాయలు తినకూడదా..! ఆయుర్వేద నిపుణులు ఎందుకు చెబుతున్నారు?

వర్షాకాలంలో ఈ కూరగాయలు తినకూడదా..! ఆయుర్వేద నిపుణులు ఎందుకు చెబుతున్నారు?

వర్షాకాలంలో, వ్యాధులు వచ్చే  అవకాశం పెరుగుతుంది , ప్రత్యేక ఆహారపు అలవాట్ల గురించి ప్రతిచోటా సూచనలు పొందుతాము. ఆరోగ్యం , కోణం నుండి, ఈ సీజన్ స్పెషలిస్ట్ వ్యాధులకు చాలా సున్నితంగా పరిగణించబడుతుంది. ఈ వాతావరణం సూక్ష్మ జీవులకు అనుకూలంగా ఉంటుంది , అవి మన ఆరోగ్యాన్ని సులభంగా ప్రభావితం చేస్తాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీ రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం అని, దీని కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. వర్షాకాలంలో త్వరగా జీర్ణమయ్యే పదార్ధాలను తినాలని ఆయుర్వేద  నిపుణులు  సూచించారు.  వారి సూచనల  ప్రకారం తినకూడని పదార్థాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.  దీంతో అది త్వరగా జీర్ణంకాదు.  అంతేకాక బబ్చలికూరలో ఇన్ ఫెక్షన్ వృద్ది చేసే మూలకాలు ఉంటాయి.  వర్షాకాలంలో ఐరన్ ఎక్కువుగా ఉండే పదార్ధాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

క్యాబేజీని ఈ సీజన్లో తినడం అంత మంచిది కాదు. వర్షాకాలంలో దీని నుంచి నుంచి దూరం పాటించడం అవసరం.  ఇందులో చల్లదనాన్ని పెంచే గుణాలు ఎక్కువుగా ఉంటాయి.  ఇది తొందరగా జీర్ణం కాదు.  వర్షాకాలం త్వరగా జీర్ణమయ్యే పదార్ధాలను తీసుకోవాలని ఆయుర్వేద  నిపుణులు సూచిస్తున్నారు. 

బెల్ పెప్పర్స్ (సిమ్లా మిర్చి).. క్రిస్పీ స్టార్టర్స్, నూడుల్స్ నుండి స్టైర్-ఫ్రైస్, కూరల వరకు అనేక రకాల వంటకాలలో ఉపయోగిస్తారు. ఈ సీజన్ కు ఇది మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎసిడిటీ, ఉబ్బరం సమస్యలు వస్తాయని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

టమోటోలో ఉండే హిస్టామిన్ అనే సమ్మేళనం అలర్జీని కలిగిస్తుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల దగ్గు, తుమ్ములు, తామర, గొంతు చికాకు, ముఖం, నోరు మరియు నాలుక వాపు వంటి సమస్యలు వస్తాయి. మీకు ఇప్పటికే అలెర్జీ ఉంటే, టమోటాలు తినవద్దు.యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో పోరాడుతున్నట్లయితే, టమోటా యాసిడ్ రిఫ్లక్స్‌ను మరింత పెంచుతుంది. టొమాటోల్లోని అసిడిక్ కంటెంట్ కడుపులో అదనపు గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది. 

కాలీఫ్లవర్ వద్దని చెప్పేందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఈ పువ్వులో దాగి ఉండే ఫంగస్ కారణంగా  ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రెండో కారణం ఇందులో గ్లూకోసినోలేట్స్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వర్షాకాలంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.