కుంకుమ పువ్వుతో ఒబేసిటీకి చెక్ పెట్టొచ్చంటున్న ఆయుర్వేద నిపుణులు

కుంకుమ పువ్వుతో ఒబేసిటీకి చెక్ పెట్టొచ్చంటున్న ఆయుర్వేద నిపుణులు

వంటల కోసం వాడే కుంకుమ పువ్వుతో.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాస్త ఖరీదెక్కువైనా ఈ సుగంధ ద్రవ్యం స్థూల కాయం సమస్యకు చక్కటి పరిష్కారమని ఆయుర్వేద వైద్య నిపుణులు నొక్కి మరీ చెబుతున్నారు. అనేకసార్లు జరిగిన పరిశోధనల్లో కుంకుమపువ్వు ప్రాధాన్యత ఎన్నోసార్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కరోనా సోకి చాలా మంది రికవరీ అవుతున్నా ఒబేసిటీ, ఇతర సమస్యలతో ఇబ్బందిపడుతూ రికవరీ అయిన వారి శాతం చాలా తక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అనేక మంది ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఆర్గానిక్ పంట ఉత్పత్తులు ఎంత వాడినా.. కుంకుమ పువ్వుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మేలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఒబేసిటీ సమస్యకు కుంకుమ పువ్వు వాడితే సరి అంటున్నారు.

మొక్క ప్రత్యేకతలే వేరు

కేవలం 15 నుంచి 20 సెంటీమీటర్లు పెరిగే కుంకుమ పువ్వు ప్రత్యేకతలే వేరు. ఆకలిని చంపే గుణాలుండడంతో ఒబేసిటీ తదితర సమస్యలతో ఇబ్బందిపడే వారికి ఇదే సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. కీళ్ల నొప్పులు.. సంతాన సాఫల్య సమస్యలకు.. ఆయుర్వేద వైద్యంలో కుంకుమ పువ్వు బెస్ట్ ఆప్సన్ అంటున్నారు. మన పూర్వీకులు కూడా దీని ప్రత్యేకతలు గుర్తించి వెజ్ అయినా..  నాన్ వెజ్ అయినా.. వండిన వంటలో మంచి కలర్.. సువాసన కోసం కుంకుమ పువ్వును ఉపయోగించటం అలవాటుగా చేసుకుని ఉంటారని గుర్తు చేస్తున్నారు. ఒబేసిటీ సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కొద్దీ… వంటలు.. ఔషధాల తయారీతోపాటు కాస్మెటిక్స్ లోనూ కుంకుమ పువ్వును ఉపయోగించడం పెరిగిందంటున్నారు.

సిరి ధాన్యాలతోపాటు.. కుంకుమ పువ్వు

స్థూల కాయం ఇబ్బందులు భరించలేక చాలా మంది బరువు తగ్గాలని సడెన్‌గా ఆహారం తగ్గించడం చేస్తుంటారు. ఆయుర్వేదంపై అవగాహన ఉన్న వారు సిరి ధాన్యాలు తినడం మొదలుపెడతారు. అయితే సరైన విధానంలో సిరిధాన్యాలతో వంట చేసుకోవడం తెలియక ఇబ్బందులు పడతారు. కొర్రలు… అండు కొర్రలు.. ఊదలు.. సామెలు  వాడడం ప్రారంభించడం వల్లేననే అపోహలతో  కొద్ది రోజులకే ఆపేస్తారు. శరీరం వేడి చేస్తోందని.. తిన్నది అరగడం లేదని.. గ్యాస్ ట్రబుల్ స్టార్టయిందని.. అందుకే మానేశామని వాపోతుంటారు. అలా చెయ్యకుండా సిరిధాన్యాలను కూడా రోజూ 8 గంటలకు పైగా నానబెట్టి వండుకుంటే పోషకాలన్నీ అందుతాయి. వేడి చేయడం.. అరగకపోవడం వంటి సమస్య ఉండదు. కుంకుమ పువ్కొవును కూాడా కలిపి వాడితే.. కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. శరీరానికి పోషకాల లభ్యత ఒక్కసారిగా తగ్గిస్తే..  సైడ్ ఎఫెక్ట్స్‌లు పెరుగుతాయి. అందువల్ల తగినంత పరిమాణంలో ఆహారం తీసుకొవాలి. ముఖ్యంగా కుంకుమ పువ్వుతోపాటు.. సిరిధాన్యాలు తినడం ప్రారంభించిన వెంటనే శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ఆగిపోతుంది. సెరెటోనిన్‌పై ప్రభావం చూపడం వల్ల ఆటోమేటిక్‌గా తక్కువ ఆహారం తింటూ… స్నాక్స్ లాంటి వాటికి దూరం జరుగుతారు. అందువల్ల సులభంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కుంకుమ పువ్వు తినేవారికి తీపి పదార్థాలు తినబుద్ధి కాదు… తీపి పదార్థాలు తీసుకోకపోతే శరీరంలో గ్లూకోజ్ పెరగదు..  ఎక్కువగా నిల్వ ఉండదు… కాబట్టే  బరువు త్వరగా తగ్గుతారని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. ఒబేసిటీని కంట్రోల్ చేసుకుని.. బయటపడితే.. కరోనా కూడా ఏమీ చేయలేదని వారు స్పష్టం చేస్తున్నారు.