కాంగ్రెస్ తో పొత్తుపై ఆజాద్ చర్చలు

కాంగ్రెస్ తో పొత్తుపై ఆజాద్ చర్చలు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం యూపీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నామంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీనిపై సాయంత్రం లోపు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ తనకు 100 సీట్లు ఇచ్చినా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. బీజేపీ దూకుడును అడ్డుకునేందుకు ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. మాయావతితో పొత్తు కోసం ప్రయత్నించినా.. ఆ పార్టీ నుంచి  ఎవరూ తనను సంప్రదించలేదని ఆజాద్ చెప్పారు. ఎప్పుడూ తన స్వలాభం చూసుకోలేదని..గడిచిన ఐదేళ్లలో ప్రజల తరపున పోరాడుతూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. హత్రాస్, ప్రయాగ్ రాజ్, ఉన్నావ్ ఘటనలను నిరసిస్తూ అనేక ఆందోళనలు చేశానని..అందుకు  జైలుకు కూడా వెళ్లొచ్చానని చెప్పారు. భీమ్ ఆర్మీ కార్మికులే తనకు బలమని అన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం..

కాలనీలో చిరుత చక్కర్లు.. గేటు ముందు కూర్చొని

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు