పాకిస్థాన్ హెడ్ కోచ్ గా అజర్ మహమ్మద్

పాకిస్థాన్ హెడ్ కోచ్ గా అజర్ మహమ్మద్

న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య  ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఏప్రిల్ 18 నుంచి ప్రారంభం  కానుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్టు  కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ సిరీస్ కు పాకిస్థాన్ హెడ్  కోచ్ గా మాజీ ఆల్ రౌండర్ అజర్ మహముద్ ను నియమించింది. ఈ సిరీస్ కు ఏప్రిల్ 18,20 ,21 తేదీల్లో రావల్పిండి ఆధిత్యం ఇవ్వనుండగా, లాహోర్ లో ఏప్రిల్ 25, 27 తేదీల్లో ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బోర్డు వెల్లడించింది.

 అజర్ మహముద్ పాకిస్థాన్ తరుపున 164 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఆల్ రౌండర్ అయిన ఇతను 162 వికెట్లు పడగొట్టాడు. 2 వేల 421 పరుగులు చేశాడు. పాక్ తరుపున 2016 నుండి 2019 వరకు బౌలింగ్ కోచ్ గా కుడా పని చేశాడు.  సీనియర్ టీమ్ మేనేజర్ గా మాజీ పేసర్ వహాబ్ రియాజ్, బ్యాటింగ్ కోచ్ గా మాజీ కెప్టెన్ మహ్మాద్ యూసుఫ్ ను, అలాగే స్పిన్ బౌలింగ్  కోచ్ గా సయిద్ అజ్మల్ నియమించినట్లు పాకిస్థాన్ బోర్డు  తెలిపింది