రోడ్డు మీద వెళ్లే ప్రతి టూవీలర్ రైడర్‌కు తార్నాక జంక్షన్ వద్ద ఓ భారీ హెల్మెట్ శిల్పం ఇప్పుడు కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నది. రోడ్డు భద్రతా నియమాలను విస్మరిస్తున్న వాహనదారుల్లో మార్పు తీసుకురావడానికి ‘సర్వేజన ఫౌండేషన్’ వినూత్నంగా ఈ బాహుబలి హెల్మెట్ శిల్పాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ గురువారం రాత్రి ప్రారంభించారు. – ఉప్పల్, వెలుగు

