వన్డే క్రికెట్లో పాక్ కెప్టెన్ అరుదైన రికార్డు

 వన్డే క్రికెట్లో పాక్ కెప్టెన్  అరుదైన రికార్డు

న్యూజిలాండ్‌తో జరుగుతోన్న వన్డే సీరిస్ లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన రికార్డును నెలకొల్పాడు.  వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యంత వేగంగా 5,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.  వన్డేల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న బాబార్  97  ఇన్నింగ్స్‌లో 17 సెంచరీలు, 26  హాప్ సెంచరీలతో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.  న్యూజిలాండ్‌తో జరుగుతోన్న నాలుగో వన్డేలో బాబర్ ఈ రికార్డును నెలకొల్పాడు.  

దీంతో గతంలో 101 ఇన్నింగ్స్‌లో  5000 పరుగులు పూర్తి చేసిన  దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా రికార్డును  బాబర్ బ్రేక్ చేశాడు.  వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ 114 ఇన్నింగ్స్‌ల్లో 5000  పరుగులు పూర్తి చేశారు.  వీరి తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఉన్నాడు.  న్యూజిలాండ్‌తో  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యంలో పాకిస్థాన్ ఉంది.