10 పరుగులున్నా డిఫెండ్ చేయగలడు.. బుమ్రా కంటే మా బౌలర్ గొప్ప: బాబర్ అజాం

10 పరుగులున్నా డిఫెండ్ చేయగలడు.. బుమ్రా కంటే మా బౌలర్ గొప్ప: బాబర్ అజాం

వరల్డ్ క్రికెట్ లో ప్రస్తుతం అత్యుత్తమ పేసర్లలో బుమ్రా ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. పదునైన పేస్, యార్కర్లతో పాటు స్వింగ్ బౌలింగ్ వేయడంలో బుమ్రా దిట్ట. ప్రపంచ స్థాయి బ్యాటర్లు అతని బౌలింగ్ ధాటికి కుదేలవుతారు. అయితే పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజాం మాత్రం తమ దేశ బౌలర్ నసీం షాకు ఓటేశాడు. బుమ్రా ఎంత గొప్ప బౌలర్ అయినా నసీం షా అంతకుమించి నైపుణ్యం బౌలర్ అని అన్నాడు. 

ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బాబర్ అజామ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. T20 మ్యాచ్ చివరి ఓవర్‌లో 10 పరుగులు డిఫెండ్ చేయడానికి బుమ్రా, నసీమ్‌లలో ఒకరిని ఎంచుకోమని బాబర్‌ని అడిగారు. ఎలాంటి సంకోచం లేకుండా బాబర్ నసీమ్ షాను ఎంచుకున్నాడు. అతని ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రశంసించాడు. కేవలం 20 సంవత్సరాల వయసున్న నసీమ్..భుజం గాయంతో ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండి ఇటీవలే కోలుకున్నాడు. నసీం నైపుణ్యాలను మెచ్చుకొని సహచర ఆటగాడు షాహీన్ అఫ్రిదితో పోల్చాడు.

ALSO READ | IPL 2024: బ్రూక్ ఔట్.. రీప్లేస్ మెంట్‌ను ప్రకటించిన ఢిల్లీ క్యాపిటల్స్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత బాబర్ అజాం పాక్ క్రికెట్ కు రాజీనామా చేశాడు. అతని స్థానంలో షహీన్ షా ఆఫ్రిదిని కెప్టెన్ గా ప్రకటించారు. అయితే ఆరు నెలలకే పాక్ క్రికెట్ బోర్డు మళ్ళీ బాబర్ అజాం ను పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి న్యూజిలాండ్ తో పాకిస్థాన్ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగుంది. వెస్టిండీస్, USA సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి.