డైపర్ ర్యాష్​ మామూలే కానీ..

డైపర్ ర్యాష్​ మామూలే కానీ..

చిన్నపిల్లలకు డైపర్లు ఎక్కువ సేపు వేయడం వల్ల  కొన్నిసార్లు వాళ్లకు ర్యాష్​ వస్తుంది. దీన్నే ‘ఇరిటెంటె డైపర్ డెర్మటైటిస్’ అంటారు. ఇదొక సాధారణ స్కిన్ ఇన్​ఫ్లమేషన్. చాలావరకు తడి వల్ల ఈ ర్యాష్​  వస్తుంది. మామూలుగా అయితే రెండు రోజుల్లో తగ్గిపోతాయి. అలాకాకుండా రెండు రోజుల తర్వాత కూడా డైపర్ ర్యాష్​ తగ్గకుంటే పిల్లల్ని డాక్టర్​కి చూపించాలి అంటున్నారు పిడియాట్రిషియన్స్​. డైపర్ వేసినప్పుడు పిల్లల చర్మం తడిగా ఉంటే దురద పెడుతుంది. తడి వల్ల ఒక్కోసారి  డైపర్  శరీరానికి రాసుకున్నప్పుడు చర్మం మంట పుడుతుంది. దాంతో ర్యాష్​  మొదలవుతుంది. ఇవి పిరుదులు, తొడలు, జననాంగాల మీద ఎక్కువగా ఏర్పడతాయి. చిన్నగా ఎరుపు రంగులో ఉండి  దురద పెడతాయి. డైపర్ ర్యాష్​​ని పట్టించుకోకుంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, సోరియాసిస్, ఎగ్జిమా వంటి స్కిన్ డిజార్డర్లు వచ్చే ప్రమాదం ఉంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న పిల్లల్లో  డైపర్ ర్యాష్​ ఎక్కువ.  

 ర్యాష్​ రాకుండా..
పిల్లల బరువుని బట్టి  వాళ్లకు సరిపోయే డైపర్ వేయాలి. డైపర్ వేసేముందు పిల్లల శరీరం తడిగా ఉండకూడదు.  డైపర్లని తరచుగా మార్చడం, కొత్తవి వేయడం చాలాముఖ్యం. లేదంటే చర్మం మురికిగా అవుతుంది. ర్యాష్​ ఉన్నదగ్గర టవల్​తో రుద్దితే ఆ ప్రాంతం మరింత నొప్పి పెడుతుంది. అందుకని టవల్​తో నెమ్మదిగా అద్దాలి.