బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగు వన గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఉదయం ఎత్తారు. 0.6 టీఎంసీలను కిందకు వదులుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు దిగువ ప్రాంత తాగునీటి అవసరాల కోసం ప్రతి ఏడాది మార్చి 1న గేట్లు తెరిచి 0.6 టీఎంసీలు రిలీజ్​చేశాక క్లోజ్​ చేస్తారు.  ఒక్కరోజు నీటి విడుదల చేస్తే ఎస్సారెస్పీకి 24 గంటల తరువాత చేరుతాయి. సెంట్రల్​వాటర్​ కమిషన్​ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్​ ఇరిగేషన్​ఈఈ బన్సోడే, ఎస్సారెస్పీ డీఈలు గణేశ్ , ప్రశాంత్, ఏఈ రవి, సాయి ప్రణీత్ కలిసి ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. 

సుప్రీం ఆదేశాలు ఇలా... 

2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రతి ఏడాది జులై 1 నుంచి అక్టోబర్​ 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తుతారు. అక్టోబర్​29 నుంచి జూన్​30 దాకా మూసి ఉంచుతారు. మధ్యలో మార్చి 1న మాత్రం తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీలను కిందకు వదులుతారు.