వీటితో బ్యాచ్ లర్స్ కష్టాలకు చెక్

వీటితో బ్యాచ్ లర్స్  కష్టాలకు చెక్

చదువుకోసమో, ఉద్యోగం కోసమో చాలామంది ఇంటికి దూరంగా ఉంటుంటారు. అలాంటి బ్యాచిలర్స్‌‌కి వంట, రూమ్‌‌ క్లీనింగ్‌‌ పనులు విసుగు తెప్పిస్తాయి. కొందరైతే ఇంట్లో ఇటున్న వస్తువు తీసి అటు పెట్టరు. కానీ.. ఫ్రెండ్స్‌‌తో పాటు రూమ్‌‌ షేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పనులు  కూడా షేర్ చేసుకోవాలి. కాబట్టి అలాంటివాళ్లు కొన్ని గాడ్జెట్స్‌‌ కొనుక్కొని ఆ పనులను కాస్త ఈజీ చేసుకోవచ్చు. 

కిచెన్ వేయింగ్‌‌‌‌ స్కేల్‌‌‌‌

బ్యాచిలర్స్‌‌‌‌లో చాలామందికి వంట చేయడం రాదు. కానీ.. యూట్యూబ్‌‌‌‌లో కుకింగ్ వీడియోలు చూసి, లేదంటే అమ్మకు ఫోన్‌‌ చేసి అడిగి.. వంట చేసుకుంటారు. అలాంటివాళ్లకు పనికొచ్చే బెస్ట్ గాడ్జెట్‌‌‌‌ ఈ వేయింగ్ స్కేల్‌‌‌‌. వంటల్లో కూరగాయల క్వాంటిటీని బట్టి ఇంగ్రెడియెంట్స్‌‌‌‌ క్వాంటిటీ వేస్తేనే రుచిగా ఉంటాయి. అమ్మకు వాళ్లకంటే ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఉంటుంది. కాబట్టి అవేవీ అక్కర్లేదు. కానీ..బ్యాచిలర్‌‌‌‌ జీవితాలకు కొలతలు అందాజాగా వేయడం కష్టం. అందుకనే, ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు మార్కెట్‌‌లో చాలా కంపెనీలు వేయింగ్‌‌‌‌ స్కేల్స్‌‌‌‌ని అమ్ముతున్నాయి. ఈ మధ్య మార్కెట్‌‌‌‌లోకి స్మార్ట్‌‌‌‌ వేయింగ్‌‌‌‌ స్కేల్స్‌‌‌‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. అవి ఏ కూరలో ఎంత క్వాంటిటీతో ఏ ఇంగ్రెడియెంట్‌‌‌‌ వేయాలో కూడా చెప్తున్నాయి.


ధర: 200 రూపాయల నుంచి మొదలు

ఎలక్ట్రిక్ కెటిల్‌‌

ఉదయం లేవగానే కాఫీ, టీల కోసం చేతులు కాల్చుకునే బ్యాచిలర్స్‌‌కి ఇది బెస్ట్ ఛాయిస్‌‌. వీటిలో కాసిన్ని పాలు, టీ పొడి, పంచదార వేసి స్విచ్‌‌ వేస్తే చాలు నిమిషాల్లో టీ రెడీ అవుతుంది. టీ, కాఫీలకే కాదు దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు. వేడి నీళ్లలో వేసుకుని తినే ఇన్‌‌స్టంట్ ఫుడ్స్‌‌ చాలానే దొరుకుతున్నాయి మార్కెట్‌లో. ఈ కెటిల్స్‌‌ ఉంటే వాటిని క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇవి తక్కువ టైంలో నీళ్లను మరిగిస్తాయి. అత్యవసరమైతే కెటిల్‌‌లో రైస్‌‌ కూడా వండుకోవచ్చు. ఇరవై నిమిషాలు నానబెట్టిన బియ్యాన్ని కెటిల్‌‌లో వేసి, నీళ్లు పోసి ఆన్‌‌ చేస్తే సరిపోతుంది.  


ధర: 450 రూపాయల నుంచి మొదలు 
క్లీనింగ్‌‌ రోబోట్‌‌
చదువుకోవడానికే టైం దొరకట్లేదు.. ఇంక రూమ్‌‌ క్లీన్‌‌ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? అనుకునే బ్యాచిలర్స్ చాలామంది ఉంటారు. వాళ్లకు ఈ ఆటోమెటిక్‌‌ క్లీనింగ్‌‌ రోబోట్‌‌ బెస్ట్‌‌ ఆప్షన్‌‌. ఇవి వ్యాక్యూమ్‌‌ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇంట్లో ప్రతి మూలకు తిరిగి శుభ్రం చేస్తాయి. ఇప్పుడు వస్తున్న రోబోట్లకు ఆటోమెటిక్‌‌ టైమ్‌‌ షెడ్యూల్ ఆప్షన్‌‌ కూడా ఉంది. అంటే.. ఏ టైంలో క్లీన్‌‌ చేయాలో ప్రోగ్రామ్‌‌ చేసి పెడితే..  ప్రతి రోజు అదే టైంకి ఇల్లంతా క్లీన్‌‌ చేసి, తిరిగి డాకింగ్ స్టేషన్‌‌కి వెళ్లి దానంతటదే ఛార్జింగ్‌‌ చేసుకుంటుంది. ఇంట్లో మనుషులు ఉన్నా, లేకపోయినా దాని పని అది చేసుకుంటుంది. వీటిని మొబైల్‌‌ యాప్‌‌లతో కూడా కంట్రోల్‌‌ చేయొచ్చు. 


ధర: ఫీచర్స్‌‌ని బట్టి 15,000 నుంచి మొదలు
ఎగ్‌‌ కుక్కర్‌‌
వండుకున్న కర్రీ బాగా కుదరనప్పుడు, పప్పుచారుతో అన్నం తింటున్నప్పుడు ప్లేట్‌‌లోఉడికించిన గుడ్డు లేదంటే ఆమ్లెట్‌‌ ఉంటే బాగుంటుంది. ఇంట్లో అయితే.. గుడ్డు ఉడకబెట్టి ఇవ్వడానికి ఎవరో ఒకరు ఉంటారు. అదే బ్యాచిలర్ రూమ్‌‌లో అయితే.. ఎవరికి వాళ్లే చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ ఎగ్‌‌ కుక్కర్‌‌‌‌ బాగా పనికొస్తుంది. ఇది ఉంటే స్టవ్‌ వెలిగించాల్సిన అవసరం కూడా లేదు. ఈ కుక్కర్‌‌లో కొన్ని నీళ్లు పోసి, గుడ్లు వేసి స్విచ్‌‌ ఆన్‌‌చేస్తే చాలు. నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇప్పుడొస్తున్న కొన్ని ఎగ్‌‌ కుక్కర్లలో ఆమ్లెట్‌‌ కూడా వేసుకోవచ్చు. 


ధర: 300 రూపాయల నుంచి మొదలు