గుజరాత్‌‌‌‌లో టెస్లా ప్లాంట్‌‌‌‌?

గుజరాత్‌‌‌‌లో టెస్లా ప్లాంట్‌‌‌‌?

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ  టెస్లా ఇండియాలో తమ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌ను గుజరాత్‌‌‌‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయని రిపోర్ట్స్‌‌‌‌ పేర్కొన్నాయి. ప్రభుత్వానికి, టెస్లా ప్రతినిధులకు మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ముగింపు దశకు చేరుకుంటాయని వెల్లడించాయి. వచ్చే నెలలో జరగనున్న వైబ్రంట్‌‌‌‌ గుజరాత్ సమ్మిట్‌‌‌‌లో టెస్లా మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌‌‌కు సంబంధించి  ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

వెహికల్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌కు గుజరాత్‌‌‌‌ హబ్‌‌‌‌గా  ఎదిగింది.  మారుతి, టాటా మోటార్స్‌‌‌‌, ఫోర్డ్‌‌‌‌ వంటి పెద్ద కంపెనీల తయారీ ప్లాంట్లు ఇక్కడ ఉన్నాయి. టెస్లా ప్లాంట్‌‌‌‌ సాణంద్‌‌‌‌ లేదా బెచరజి, దొలెరాలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టెస్లా నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రాలేదు. కానీ, తాజాగా రాష్ట్ర మంత్రులు మాత్రం టెస్లా పెట్టుబడులు వస్తాయన్నారు. 

డీల్‌‌‌‌ను ఫైనలైజ్ చేయడానికి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని  గుజరాత్‌‌‌‌ హెల్త్‌‌‌‌మినిస్టర్ రుషికేశ్‌‌‌‌ పటేల్ వెల్లడించారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, దేశంలో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ పెట్టేందుకు టెస్లాకు గుజరాత్ టాప్ డెస్టినేషన్‌‌‌‌గా నిలిచింది. పాలసీలతో పాటు  పోర్టుల ద్వారా ఎగుమతులకు వీలుండడంతో ఈ రాష్ట్రం వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.