
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022కు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశాడు. మెగా ఆక్షన్ లో ఫ్రాంచైజీ వ్యవహరించిన తీరు నచ్చకనే తను రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీజన్ కు ముందే రైజర్స్.. కటిచ్కు కాంట్రాక్ట్ ఇచ్చింది. కాగా, ఆక్షన్లో హైదరాబాద్ ప్లానింగ్ చర్చనీయాంశమైంది. డొమెస్టిక్ ప్లేయర్ అభిషేక్ శర్మకు 6.75 కోట్లు పెట్టడం విమర్శలకు దారితీసింది. కాగా, సన్ రైజర్స్ కటిచ్ రాజీనామాను ఆమోదించి అతని ప్లేస్లో సైమన్ హెల్మోట్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది.