లోకేష్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఖైదీ2, విక్రమ్2 సినిమాలకు డైరెక్టర్ చేంజ్

లోకేష్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఖైదీ2, విక్రమ్2 సినిమాలకు డైరెక్టర్ చేంజ్

లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj).. ఈ దర్శకుడి నుండి ఒక సినిమా వస్తుదంటే ఆ నేషనల్ వైడ్ గా ఆ సినిమాకు వచ్చే హైప్ మామూలుగా ఉండదు. రీసెంట్ గా ఈ దర్శకుడి నుండి వచ్చిన లియో(Leo) మూవీ కలెక్షన్స్ చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో విజయ్(Vijay) అయినప్పటికీ.. కేవలం లోకేష్ అనే పేరువల్లనే అంత హైప్ క్రియేట్ అయ్యింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్. 

ఇక తన సినిమాలను ఒకదానితో ఒకటి లింకప్ చేసి.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) ను క్రియేట్ చేసి ఆడియన్స్ కు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్నారు ఈ టాలెంటెడ్ దర్శకుడు. ఇటీవలే లియో మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడి తరువాతి సినిమా కోసం ఆడియన్స్, ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో తన తరువాతి సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ కు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే.. ఇకనుండి లోకేష్ LCU లో సినిమాలు చేయడట. అందులో భాగంగా వస్తున్న ఖైదీ2, విక్రమ్2 సినిమాల భాధ్యతను తన శిష్యులకు అప్పగించి.. తాను మాత్రం కొత్త కథలపై వర్క్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ న్యూస్ తెలుసుకున్న లోకేష్ ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్నారు. LCU లో స్టార్ హీరోలందరిని ఒకే సినిమాలో లోకేష్ ఏలా చూపించబోతున్నాడు అనే ఆలోచనలో ఉన్న ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.