జీమెయిల్​కి బ్యాడ్జ్.. ఇకపై భద్రత మరింత మెరుగ్గా

జీమెయిల్​కి బ్యాడ్జ్.. ఇకపై భద్రత మరింత మెరుగ్గా

ఆన్​లైన్​లో వాడే ఫీచర్ వాడినా, అందులో కస్టమర్​ వివరాల్లో మెయిల్ ఐడీ లింక్​ అయి ఉండడం వల్ల కంపెనీలు ఆఫర్ల వివరాలతో మెయిల్స్ వస్తుంటాయి. అయితే, వాటిలో కొన్ని నకిలీ (ఫేక్) మెయిల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ వాటిని ఓపెన్ చేసినా, వాటిలోపల ఉండే లింక్​ పై క్లిక్ చేసినా సైబర్ దొంగలకు దొరికినట్లే. మరి ఆ మెయిల్​ నకిలీదా? కాదా? అనేది తెలుసుకోవడానికి గూగుల్ ఈ కొత్త ఫీచర్​ని తీసుకొచ్చింది. ట్విటర్ వెరికేషన్ బ్యాడ్జ్​లానే, గూగుల్ కూడా జీమెయిల్​కి బ్యాడ్జ్​ తెచ్చింది. కంపెనీలు తమ బ్రాండ్​ లోగోను వెరిఫికేషన్​ చేసిన బ్యాడ్జ్​ను తీసుకోవచ్చు. 

ఇది గూగుల్ వర్క్​ స్పేస్, జీ సూట్ బేసిక్, బిజినెస్ అవసరాలకు పర్సనల్ జీమెయిల్ అకౌంట్​ వాడుతున్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి అప్లై చేసుకోవాలంటే... యూజర్లు తమ కంపెనీ లోగోను బీఐఎమ్​ఐలో వెరిఫై చేయాలి. అయితే, ఆ లోగో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూపిఒ) దగ్గర రిజిస్టర్ చేసుకుని ఉండాలి. ​బీఐఎమ్​ఐలో డొమైన్ వివరాలు ఎంటర్ చేసి, వెరిఫైడ్​ మార్క్​ సర్టిఫికెట్ కోసం అప్లై చేయాలి. ఆ తర్వాత యూజర్​ అప్లికేషన్​ని బీఐఎమ్​ఐ, జీమెయిల్ అకౌంట్​కు బ్రాండ్​ లోగోతోపాటు వెరిఫైడ్ బ్యాడ్జ్ ఇస్తుంది. కంపెనీలు పంపే మెయిల్​కు యూజర్ ఇన్​బాక్స్​లో ఐడీ పక్కన లోగో, వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తాయి.