కరోనా వ్యాక్సిన్ల కోసం బాహుబలి ఫ్రీజర్లు

కరోనా వ్యాక్సిన్ల కోసం బాహుబలి ఫ్రీజర్లు

సప్లై కోసం కంపెనీలు రెడీ

మూలకైనా సప్లై చేసేలా సిద్ధం

మైనస్​ 80 సెల్సియస్ టెంపరేచర్‌‌‌‌లో యాక్సిన్ స్టో రేజ్

బిజినెస్డెస్క్ , వెలుగు: కరోనా వ్యాక్సిన్ రావడం ఒక ఎత్తు అయితే.. ఆ వ్యాక్సిన్ గ్లోబల్‌‌గా వెను వెంటనే సప్లై చేయడం మరో ఎత్తు. కంపెనీలు తయారు చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌ ను సప్లై చేసేందుకు అమెరికన్‌ కంపెనీ యునైటెడ్ పార్శిల్ సర్వీస్ (యూపీఎస్) రెండు అతిపెద్ద ఫ్రీజర్ ఫెసిలిటీస్‌ ను అభివృద్ది చేస్తోంది. కరోనా వ్యాక్సి న్‌ ఉన్న లక్షల కొద్దీ చిన్న కంటైనర్లను సూపర్ కూలింగ్‌‌లో ఉంచేందుకు ఈ ఫ్రీజర్లు ఉపయోగపడతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ ను హైస్పీడ్‌‌గా డెలివరీ చేసేందుకు తాము ముందస్తుగానే సిద్ధమవుతున్నామని కంపెనీ ప్రకటించింది. ఈ ఫెసిలిటీస్‌ను నెదర్లాండ్స్‌‌లో, కెంటుకీలోని లూయిస్‌ విల్లేలో ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు ఫ్రీజర్లలో –80 సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ వద్ద కంటైనర్లను స్టోర్ చేసేందుకు వీలవుతుంది. ఈ ఫ్రీజర్ల టెంపరేచర్ అంటార్కిటికాలోని అతి శీతల ఉష్ణోగ్రతలకు సమానంగా ఉంటుంది. ప్రాణాలను కాపాడే ఈ కరోనా వ్యాక్సిన్‌ ను గ్లోబల్ పాపులేషన్‌ కు చేరుకునేలా మిలియన్ల కొద్దీ గ్లాస్ కంటైనర్లలో సప్లై చేయనున్నామని, ఇది చరిత్రాత్మకమైన సప్లై చెయిన్‌ అని యూపీఎస్ హెల్త్‌‌కేర్ ప్రెసిడెంట్ వెస్ వీలర్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ సప్లై పైననే చాలా మంది ప్రాణాలు ఆధారపడి ఉన్నాయని, అన్ని వైపుల నుంచి తాము సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం, దాని చికి త్స కోసం రీసెర్చర్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. పలు ప్రాజెక్ట్‌‌లు ఇప్పటికే పలు రకాల ట్రయల్స్‌‌లో ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ సక్సెస్‌ అయినా కూడా దాన్ని వెనువెంటనే ప్రపంచానికి సప్లై చేయడమే అతిపెద్ద ఛాలెంజ్‌ . ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు, పేషెంట్లకు ఈ మెడిసిన్‌ ను అందించగలగాలి.

 ఫెడ్ఎక్స్, డీహెచ్‌‌ఎల్‌‌లు టెంపరేచర్లు విస్తరణ

ఫెడ్‌‌ఎక్స్, డీహెచ్‌‌ఎల్ గ్లోబల్‌‌లు కూడా తమ టెంపరేచర్లను విస్తరించేందుకు చూస్తున్నాయి. డీహెచ్‌‌ఎల్ 1.6 మిలియన్ డాలర్ల ఫెసిలిటీని ఈ నెలలోనే ఇండియానాపోలిస్‌ లో ఏర్పాటు చేసిం ది. ఫెడ్‌‌ఎక్స్ కూడా ఫ్రీజర్లను, రిఫ్రిజిరేటర్ ట్రక్క్‌‌లను, సె న్సర్లను, థర్మల్ బ్లాంకెట్లను అడిషినల్‌‌గా ఏర్పాటు చేసిం దని గ్లోబల్ మీడియా రిలేషన్స్ డైరె క్టర్ బోనీ హర్రిసన్ తెలిపారు.

ప్రభుత్వాలతో, మె డికల్ సిస్టమ్స్‌‌తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు . అట్లాంటాకు చెందిన కొరియర్ కూడా అమెరికా హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్, హ్యుమన్ సర్వీసెస్, ఫెడరల్ ఆపరేషన్ వ్రాప్ స్పీ డ్ టీమ్‌‌తో చర్చిస్తోంది. ఈ వ్యాక్సి న్‌ ను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ఏమీ అవసరమవుతాయో కనుకొంటోంది. ఆపరేషన్ వ్రాప్ స్పీడ్ ను పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌‌షిప్‌‌లో ఫెడరల్ గవర్న్‌‌మెంట్ ఏర్పాటు చేసింది. ఇది జాన్సన్ అండ్ జాన్సన్ , ఫైజర్ ఇంక్, మోడ్రనా ఇంక్ వంటి ఫార్మా కంపెనీలతో కలిసి కరోనా వ్యాక్సి న్లను, డయాగ్నోస్టిక్స్‌‌ను అభివృద్ధి చేసి, తయారు చేసి, డిస్ట్రిబ్యూట్  చేయనుంది.