తెలంగాణ కోసం ప్రత్యేక హెల్త్ పాలసీ.. ప్రకటించిన బజాజ్ ఎలియాంజ్

తెలంగాణ కోసం ప్రత్యేక  హెల్త్ పాలసీ.. ప్రకటించిన బజాజ్ ఎలియాంజ్

హైదరాబాద్, వెలుగు:  బీమా సంస్థ బజాజ్ ఎలియాంజ్ తెలంగాణ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ఆరోగ్య బీమా ప్లాన్‌‌‌‌‌‌‌‌ ‘మీ కోసం’ను ఆవిష్కరించింది.  ఇది తక్కువ ధరలలో సమగ్ర ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. 

ఈ పథకం ద్వారా చిన్న వ్యాధుల నుంచి పెద్ద ఆపరేషన్ల వరకు, ఆసుపత్రి ఖర్చుల నుంచి ఔట్-పేషెంట్ ఖర్చుల వరకు అనేక రకాల ఆరోగ్య సంరక్షణ సేవలకు కవరేజీ లభిస్తుంది.  రాష్ట్ర ప్రజల జీవనశైలి, ఆరోగ్య అవసరాలు  ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించామని, తక్కువ ప్రీమియంతో సమగ్ర ఆరోగ్య కవరేజీని అందిస్తుందని కంపెనీ అధికారులు తెలిపారు. 

ఆసుపత్రిలో చేరడం, ఆపరేషన్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, అంబులెన్స్ చార్జీలు,  కొన్ని ఔట్‌‌‌‌‌‌‌‌పేషెంట్ ఖర్చులకు కూడా కవరేజీ ఉంటుంది.  క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసి, వేగంగా పరిష్కరించేలా రూపొందించామని, వ్యక్తిగతంగా లేదా కుటుంబానికి (ఫ్లోటర్ ప్లాన్) కూడా ఈ బీమాను తీసుకోవచ్చని కంపెనీ సీనియర్​అధికారి ఒకరు చెప్పారు.