
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో ఓ బజాజ్ చేతక్ పై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 126 చలాన్లు జనరేట్ అయ్యాయి. ఏపీ10జీ8764 నంబర్ చేతక్ పై 2019 మే నుంచి 2022 అక్టోబర్ వరకు వేసిన చలాన్లన్నీ లెక్కిస్తే ఫైన్ల అమౌంట్ రూ.28,875కు చేరింది.
ఇందులో 120 చలాన్లు విత్ ఔట్ హెల్మెట్ వే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చేతక్ బండి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాత చేతక్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఓనర్ దానిని వాళ్లకే ఇచ్చేసి వెళ్తాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.