
న్యూఢిల్లీ: ఐపీఓ ద్వారా రూ.4 వేల కోట్లు సేకరించాలని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్లాన్ చేస్తోంది. బజాజ్ ఫైనాన్స్ సబ్సిడరీ అయిన ఈ కంపెనీ ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా, ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను అమ్మనుంది. కాగా, రూ.50 వేల కోట్ల కంటే ఎక్కువ అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల లిస్ట్‌ను కిందటేడాది సెప్టెంబర్‌లో రిజర్వ్ బ్యాంక్ విడు దల చేసింది. ఈ లిస్టులోని ఎన్‌బీఎఫ్‌సీలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోపు మార్కెట్‌లో లిస్ట్ కావాలి. మార్కెట్ పరిస్థితులు, రెగ్యులేటరీ అనుమతులు బట్టి ఐపీఓ ఉంటుందని బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పేర్కొంది.