
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న కొత్త మూవీ ‘అఖండ’. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.తాజాగా ఈ సినిమా నుంచి అఖండ టైటిల్ సాంగ్ విడుదలైంది. 'భం అఖండ... భం భం అఖండ' అనే ఈ టైటిల్ సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్ లో రీలజ్ చేసింది.బాలయ్య ఈ హైఓల్టేజ్ సాంగ్ కు తమన్ మ్యూజిక్ అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను మహదేవన్ త్రయం (శంకర్, సిద్ధార్థ్, శివం) అద్భుతంగా ఆలపించించారు. నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య లుక్ విడుదల కాగా, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం రత్నం డైలాగ్స్ అందించారు. బాలయ్య మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించనున్నారు. . ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.