
బాలకృష్ణ, రజినీకాంత్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అది అభిమానులకు పండగే. ఈ క్రేజీ కాంబో త్వరలోనే చూడొచ్చని తెలుస్తోంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’లో బాలకృష్ణ నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో జరుగుతోన్న ఈ మూవీ షూటింగ్ కోసం బాలకృష్ణ ఇరవై రోజుల కాల్సీట్స్ ఇచ్చారట.
ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డిజైన్ చేశాడట. ముఖ్యంగా రజినీకాంత్, బాలయ్య మధ్య వచ్చే సీన్స్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ‘జైలర్’ ఫస్ట్ పార్ట్‌లో రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ స్ర్కీన్ షేర్ చేసుకోవడం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అయితే కొనసాగింపుగా వస్తున్న ‘జైలర్2’లో వీరు కొనసాగుతారా లేదా వీరిలో ఒకరి పాత్రకు బదులుగా బాలకృష్ణను తీసుకున్నారా, లేదంటే వీరితో పాటు బాలయ్య పాత్ర కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నారో తెలియాల్సి ఉంది.
ఏదేమైనా ‘జైలర్2’ కోసం బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారనే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ2’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఎమ్మెల్యేగా ఒక నెల జీతాన్ని ఆర్ధికసాయం ప్రకటించారు.