ఇవాళ్టి నుంచి అనంతపురంలో బాలయ్య సినిమా షూటింగ్

ఇవాళ్టి నుంచి అనంతపురంలో బాలయ్య సినిమా షూటింగ్

బాలకృష్ణ హీరోగా  గోపీచంద్ మలినేని డైరెక్ట్‌‌ చేస్తున్న సినిమా ‘వీర సింహారెడ్డి’. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌.  దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌‌ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మాస్, యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌‌‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

బుధవారం నుంచి అనంతపురంలో కొత్త షెడ్యూల్‌‌ని స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ ఫోర్ట్ తదితర ప్రదేశాల్లో ఐదు రోజుల పాటు కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.

రాయలసీమ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ టీజర్, డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా అభిమానులు ఊహించిన దానికంటే రెండింతలు ఎక్కువే మెప్పిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.