హైదరాబాద్​లో​ వాల్యూజోన్​ హైపర్​మార్ట్​.. ప్రారంభించిన హీరో బాలకృష్ణ

హైదరాబాద్​లో​ వాల్యూజోన్​ హైపర్​మార్ట్​..  ప్రారంభించిన హీరో బాలకృష్ణ
  • హైదరాబాద్​లో​ వాల్యూజోన్​ హైపర్​మార్ట్​
  • ప్రారంభించిన హీరో బాలకృష్ణ

హైదరాబాద్​, వెలుగు : వాల్యూ జోన్ హైపర్​మార్ట్​నగరంలోని​పటాన్​చెరులో శుక్రవారం షురూ అయింది. సినీ నటుడు బాలకృష్ణ దీనిని ప్రారంభించారు. ఇండస్ట్రియలిస్టులు పి.వెంకటేశ్వర్లు, ఎస్​.రాజమౌళి, టి.ప్రసాదరావు దీనిని ఏర్పాటు చేశారు. నాణ్యమైన ప్రొడక్టులను తక్కువ ధరలకే అందించడం తమ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ కిరాణా సరుకులతోపాటు ఫ్యాషన్​, ఫుట్​వేర్​, లగేజ్​, ఫర్నిషింగ్స్, స్టేషనరీ, మొబైల్​ యాక్సెసరీస్​ సహా రెండు లక్షలకుపైగా వస్తువులు దొరుకుతాయి. ఏడాది పొడవునా వీటిపై డీల్స్​, డిస్కౌంట్లు ఉంటాయి. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘వాల్యూ జోన్​ హైపర్​ మార్ట్​ రిటైలింగ్​లో ఒక వినూత్న విప్లవం. మన హైదరాబాద్​ నగరానికే గర్వకారణం. విస్తృతశ్రేణికి చెందిన నాణ్యమైన ఉత్పత్తులను లాభసాటి ధరలకు కొనుగోలు చేయడం గొప్ప షాపింగ్​అనుభవం. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ప్రతి వస్తువుకూ కేరాఫ్​ అడ్రస్​ వాల్యూ జోన్​ హైపర్​మార్ట్​”అని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సీర్ణ సురేశ్​, పీవీఎస్​ అభినవ్​, టి.రాకేశ్​, టి.కేశవ్​గుప్తా పాల్గొన్నారు.