
నందమూరి బాలకృష్ట , భోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే బ్లాక్ బస్టరే. మూవీ వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర ఖాయమని అభిమానులు ఫిక్స్ అవుతారు. గతంలో వీరి కలయికలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' , 'అఖండ' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు . ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రం 'అఖండ 2: తాండవం'. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021లో సంచలన సృష్టించిన అఖండ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగానే.. ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను సృష్టిస్తోంది.
భారీ రేటుకు OTT రైట్స్
లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని వెచ్చించి ‘అఖండ 2: తాండవం’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ సుమారు రూ. 80 కోట్లకు పైగానే జరిగినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల మార్కెట్ ఉన్న కొద్దిమంది హీరోల సినిమాలకు మాత్రమే ఈ స్థాయిలో ఓటీటీ రేటు లభిస్తుంది. బాలయ్య గత చిత్రం ‘డాకు మహారాజ్’ డిజిటల్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇప్పుడు ‘అఖండ 2’కు ఇంత భారీ ధర పలకడం బాలయ్య కెరీర్‌లోనే ఒక కొత్త రికార్డు అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీ ఆచంటలకు ఓటీటీ రూపంలో జాక్‌పాట్ తగిలినట్లేనని టాక్ వినిపిస్తోంది.
ALSO READ : ఐశ్వర్య రాయ్ పేరు, ఫొటోలు వాడటానికి వీల్లేదు.
పాన్ ఇండియా స్థాయిలో!
గతంలో ‘అఖండ’ మూవీ హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదలచేసినప్పుడు ఉత్తరాది ప్రేక్షకుల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారిని బాగా ఆకట్టుకుంది. ఈ రెస్పాన్స్ ఆధారంగానే, ‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్ . బాలయ్య సినిమాలకు ఉత్తరాదిలో ఉన్న క్రేజ్ ఈ నిర్ణయానికి మరింత బలాన్నిచ్చింది. ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా అఘోరా పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా బోయపాటి డిజైన్ చేశారని, ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది.
ఈ సారి తాండవమే..
ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తుండగా, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’లోని థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్‌కు మరింత పవర్‌ఫుల్ మ్యూజిక్‌ను థమన్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా వాయిదా వేయడానికి కూడా థమన్ కూడా ఒక కారణమని ఇటీవల బాలయ్య చెప్పారు. అఖండ1కు మించి ఈ సారి మ్యూజిక్ ను మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు.
తొలుత ఈ ‘అఖండ 2: తాండవం’ సినిమాను దసరాకి విడుదల చేయాల్సి ఉంది. కానీ మ్యూజిక్, గ్రాఫిక్స్ వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న సమచారం ఈ సినిమాను డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజ్ చేయననున్నారు. వరుసగా నాలుగు హిట్‌లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య కెరీర్‌లో ‘అఖండ 2’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.