బైపోల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని కేటీఆర్ ముందే పసిగట్టారు : ఎమ్మెల్సీబల్మూరి వెంకట్

బైపోల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని కేటీఆర్ ముందే పసిగట్టారు : ఎమ్మెల్సీబల్మూరి వెంకట్
  • కాంగ్రెస్ ఎమ్మెల్సీబల్మూరి వెంకట్ ఎద్దేవా

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ముందే పసిగట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎద్దేవా చేశారు. అందుకే ఓటమికి కారణాలను ఇప్పటి నుంచే వెతుక్కుంటున్నారని విమర్శించారు. 

సోమవారం హైదరాబాద్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి రెండేండ్లు గడిచినా, తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను ప్రగతి భవన్ నుంచి తన్ని తరిమేసినా..కేటీఆర్​లో ఏమాత్రం అహం తగ్గలేదని బల్మూరి ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు.