అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమా కోసం కేటీఆర్ హడావిడి

అట్టర్ ఫ్లాప్ అయ్యే సినిమా కోసం కేటీఆర్ హడావిడి

తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలని బీజేపీ నేతలను కోరారు బండ కార్తీక రెడ్డి. ఇవాళ(బుధవారం) బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంచార్జి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె…అట్టర్ ప్లాప్ అయ్యే సినిమా కోసం మంత్రి కేటీఆర్ హడావిడి ఎక్కువైందన్నారు. ఓటమి భయంతో ఆయన జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. GHMC ఎన్నికల్లో కారు పక్చర్ కావడం ఖాయమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో జరిగిన అన్యాయం బీజేపీలో జరగదనే నమ్మకంతో వచ్చినట్లు కార్తీక రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ పార్టీ  తనకు ఇవ్వాల్సిన టికెట్ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించిందన్నారు. GHMC ఎన్నికల్లో తాను పోటీచేయబోనన్న బండ కార్తీక రెడ్డి… గ్రేటర్ మేయర్ సీటు బీజేపీదేనన్నారు.