మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : బండారి సంజువులు

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : బండారి సంజువులు

తాడ్వాయి, వెలుగు : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బండారి సంజువులు సూచించారు. శుక్రవారం ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో రాజంపేట మండలంలోని గుండారం, కొండాపూర్ స్కూళ్లలో విద్యార్థులకు  డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, గుట్కా తంబాకు వంటి చెడు అలవాట్లకు లోనుకావద్దన్నారు. బాగా చదివితే మంచి భవిష్యత్​ ఉంటుందని, మత్తు పదార్థాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.  కార్యక్రమంలో ఆయా స్కూళ్ల హెచ్​ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.