
దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను ఆహ్వానిస్తూ ఫౌండేషన్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఫౌండేషన్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి, పలువురు సభ్యులు మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసైని కలిసి 2023 అక్టోబర్ 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని కోరారు.