ప్రభుత్వంలో ఒక వికెట్ పడింది : బండి సంజయ్

ప్రభుత్వంలో ఒక వికెట్ పడింది : బండి సంజయ్

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఆంధ్రాకు వెళ్లడంతో కేసీఆర్ ప్రభుత్వంలో ఒక వికెట్ పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కొల్లాపూర్ లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. మాజీ సీఎస్ పై ఫైర్ అయ్యారు. సోమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఉసురు ఊరికేపోదని.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆయన చెంప చెళ్లుమనిపించిందని అన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సోమేశ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయని.. పేదోళ్ల ఉసురు పోసుకున్న పాపం ఊరికే పోతుందా అంటూ మండిపడ్డారు. సీఎస్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.