అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల నెంబర్ వన్: బండి సంజయ్

అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల నెంబర్ వన్: బండి సంజయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కబ్జాల కోసం ఆరాటపడుతున్నారని....తాను పేదల కోసం పోరాటం చేస్తున్నానని.. ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండని బీజేపే జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రజలనుద్దేశించి అన్నారు.2023, నవంబర్ 20వ తేదీ సోమవారం కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్, ఫకీర్ పేటలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల కమలాకర్ నెంబర్ వన్ అని విమర్శించారు.  బియ్యం టెండర్లలో  గంగుల రూ.1300 కోట్ల నగదును గోల్ మాల్ చేశాడని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. తన ఇంట్లోని వారికే కేసీఆర్ పదవులు ఇచ్చుకున్నాడని.. నిరుద్యోగులు ఏం పాపం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి తారీకు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులని ప్రజలను  హెచ్చారించారు. అధికారంలోనే లేని తనను అవినీతి పరుడంటున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నది మీరే కదా?.. తాను అవినీతికి పాల్పడితే అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

గంగుల, కేసీఆర్ లు ఇద్దరూ కరీంనగర్ ప్రజలను మోసం చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా కొత్త రేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేదని.. కానీ, ఎంపీగా ఓడిపోయి ఆరు నెలలు ఖాళీగా ఉన్న తన కూతురిని ఎమ్మెల్సీని చేశాడని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని..బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దోచుకున్న సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామనన్నారు. తెలగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలుపించుకోవాలని సంజయ్ అభ్యర్థించారు.