
గోదావరిఖని, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు సోమవారం గోదావరిఖనిలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ నుంచి కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు వెళ్తూ గోదావరిఖనిలో కొద్దిసేపు ఆగారు. బస్టాండ్ వద్ద రామగుండం బీజేపీ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో లీడర్లు గాండ్ల ధర్మపురి, కోమళ్ల మహేశ్, పిడుగు కృష్ణ, కుమారస్వామి, రమేశ్, విశ్వాస్, పవన్, అపర్ణ, రవి, పాల్గొన్నారు