హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 2024 ఫిబ్ర వరి 1న గ్రూప్ -1 నియామకాలను చేపడతామని రేవంత్ హామీ ఇచ్చారు. మరి శుక్రవారం ఫిబ్రవరి 2వ తేదీ... కానీ ఇప్పటి దాకా ఆ ఊసే లేదు” అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా పవిత్రంగా భావించే మీ మేని ఫెస్టోను మీరే అమలు చేయకుంటే ఎట్లా అంటూ ఫైర్ అయ్యారు.
శుక్ర వారం రాత్రి బీజేపీ స్టేట్ ఆఫీసులో సంజయ్ మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీని అమ లు చేస్తామని వందల సార్లు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.