డాక్టర్ బంగారి స్వామికి కేంద్ర మంత్రి అభినందన 

డాక్టర్ బంగారి స్వామికి కేంద్ర మంత్రి అభినందన 

కరీంనగర్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మినహా తెలంగాణలో మోకాలు కీలు మార్పిడికి  రోబోటిక్ చికిత్సా విధానాన్ని కరీంనగర్‌‌‌‌కు తీసుకురావడంపై రెనే హాస్పిటల్ చైర్మన్ డాక్టర్‌‌‌‌ బంగారి స్వామి, ఎండీ డాక్టర్‌‌‌‌ బంగారి రజని ప్రియదర్శినిలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌‌ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

జ్యువెల్లరీ షాపు చోరీ ఘటనలో గాయపడిన బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన రోబోటిక్ వైద్య విభాగం పనిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ చైర్మన్ సునీల్ రావు, కార్పొరేటర్లు ప్రవీణ్ రావు, సోమిడి వేణు పాల్గొన్నారు.