సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ

ఆసరా పెన్షన్ల విషయంలో కేసీఆర్ సర్కారు వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పెన్షన్ల వయో పరిమితిని 57ఏళ్లకు తగ్గిస్తామని 2-018లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 57 ఏళ్లు నిండిన అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని సంజయ్ అన్నారు. 2018లో సర్కారు ఇచ్చిన హామీ అమలై ఉంటే.. అర్హులైన వారిలో ఒక్కొక్కరు రూ.78,624 మేర లబ్దిపొందే వారని చెప్పారు. ఈ బకాయిలను వెంటనే వారికి చెల్లించాలని డిమాండ్ చేశారు. 

ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప అందుకు తగ్గ కసరత్తు చేయకపోవడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలు సైతం విడుదల చేయకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక కుటుంబానికి ఒకే ఆసరా పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయమనన్న ఆయన.. అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల దాదాపు 2 లక్షల మంది వృద్ధులు పెన్షన్కు నోచుకోవడం లేదని, ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు విడుదల చేసి బడ్జెట్లో కొత్త పెన్షన్లకు అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

For more news..

అఖిలేష్తో పొత్తుకు గుడ్ బై చెప్పనున్న శివపాల్

లోక్ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్