రాష్ట్రం మాఫియాకు అడ్డాగా మారింది

V6 Velugu Posted on May 14, 2022

రంగారెడ్డి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి... రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని బండి సంజయ్ రాష్ట్ర ప్రజలను కోరారు. తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... ‘‘కాంగ్రెస్ ను గెలిపించారు... టీఆర్ఎస్ ను ఆదరించారు...  బీజీపీకి కూడా ఒక్క అవకాశం ఇవ్వండి’’ అంటూ కోరారు. కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికి, ప్రజల్లో భరోసా నింపడానికే తాను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరిగిందన్నట్లు... కేసీఆర్ కు అధికారం కట్టబడితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేసీఆర్ ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి శ్రీలంకకు పట్టిన గతే పడుతుందన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్న సంజయ్... కేబినెట్ లోని ప్రధాన పోస్టులన్నీ కేసీఆర్ కుటుంబానికే దక్కాయన్నారు. 

డ్రగ్స్ మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా... ఇలా ప్రతి రంగంలో రాష్ట్రాన్ని మాఫియాకు అడ్డగా మార్చారని ఆరోపించారు. నిజాం రాజులు, ఔరంగజేబ్ వారసులకు మోకరిల్లే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక ఎంత మాత్రం పాలించే హక్కు లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అలాగే పెట్రోల్ పై వ్యాట్ తగ్గిస్తామని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటామని వాగ్దానం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు సహరించిన ప్రతి ఒక్కరికి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.

 

మరిన్ని వార్తల కోసం...

కేసీఆర్ సర్కార్‌‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలి 

కేసీఆర్ అంటే... కల్వకుంట్ల కమీషన్ రావు

Tagged Bjp, Bandi Sanjay, CM KCR, KTR, amit shah, praja sangrama yathra

Latest Videos

Subscribe Now

More News