అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం : బండి సంజయ్

అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం : బండి సంజయ్

నాగోబా దయతో రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాగోబాను ఆయన దర్శించుకున్న ఆయన... ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే నాగోబా జాతరకు ప్రభుత్వం అరకొర ఏర్పాట్లు చేయడం బాధకరమన్నారు. బీజేపీ అధికారంలో రాగానే..  దేశం అబ్బురపడేలా నాగోబా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. జల్ జమీన్ జంగిల్ కోసం ఆదివాసీలు నేటికి పోరాడుతూనే ఉన్నారన్నారు. పోడు వ్యవవహారంలో బాలింతలను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించారు. 8 మంది గిరిజన ఎంపీలను కేంద్ర మంత్రులను చేయడంతోపాటు ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు.

నిజాం మనువడు ఎక్కడో చస్తే హైదరాబాద్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం విడ్డూరమని బండి సంజయ్ అన్నారు. నిజాంపై పోరాటం చేసిన కొమరం భీంను అవమానించేలా కేసీఆర్ వ్యవహరించారన్నారు. లక్షా 30వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరంతో ఎకరా కూడా తడవలేదన్నారు. దివాళ తీసిన టీఆర్ఎస్ను బోర్డు మార్చి బీఆర్ఎస్ గా మార్చారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. సర్పంచులకు తెలవకుండా నిధులు దోచుకెళ్లిన దొంగ కేసీఆర్ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కి ఇది చివరి అసెంబ్లీ అని అన్నారు.